Paramaguruvutho sahajeevanam -- Mahalasapthi jeevita charitra
Siddhaguru Sri Ramanananda Maharshi
Narrateur Lalita
Maison d'édition: Siddhaguru Sri Ramanananda Maharshi
Synopsis
ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఒక మహనీయుడు ఉన్నాడు. అతడే శిరిడి సాయినాథుని అంకిత శిష్యులలో అత్యంత గౌరవనీయుడైన మహల్సాపతి. అరవై సంవత్సరాలు సాయినాథుని సేవలో లీనమై జీవించాడు. నిరాకార పరబ్రహ్మమైన శివుడికి ‘సాయి’ అని నామకరణం చేసిన గొప్ప భాగ్యం పొందినవాడు. సాయిని మొదట పూజించిన ప్రథమ భక్తుడు. హేమద్‌పంత్ సత్చరిత్రలో మహల్సాపతిని సాయిప్రథమ శిష్యుడిగా గౌరవించాడు. నలభై సంవత్సరాలు సాయితో పాటు మసీదులో నిదురించే సౌభాగ్యం కూడా అతనికే దక్కింది. సాయినాథుని నుండి స్వయంగా ‘భక్తా’ అనే బిరుదును అందుకున్నాడు. సాయినాథుడే స్వయంగా మహల్సాపతి వద్దకు వచ్చి దర్శనం ఇచ్చి , తన ప్రియభక్తుని హృదయానికి మరింత చేరువయ్యాడు. సాధారణ భక్తుడిగా ఆరంభమైన మహల్సాపతి జీవనయాత్ర, సాయిబాబాపై అపారమైన ప్రేమతో నిత్యసహచరుడిగా వెలుగొందింది. ఆయన పేరు సాయి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు రచించిన ఈ గ్రంథం, మహల్సాపతి ఆధ్యాత్మిక జీవన యాత్రను మన ముందుకు తెస్తుంది.
Durée: environ 2 heures (01:58:08) Date de publication: 02/10/2025; Unabridged; Copyright Year: — Copyright Statment: —

